Share This on Your Social Netowrkబోనాల పండుగా
భాగ్యనగరం లో అత్యంత భక్తి తో , ఉత్సాహం తో జరిగే అపురూపమైన ఉత్సవం బోనాల పండుగ . ప్రతి సంవత్సరం ఆషాడ మాసం లో గోల్కొండ కోటలో కొలువై ఉన్న మహకాళి అమ్మ వారి ఆలయం లో ప్రారంబం అవుతయీ .
బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.ఆచారాలుఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.
తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

పోతురాజుదేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

విందు సంబరాలుబోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగంరంగం, లేక జాతకం చెప్పడం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. భక్తుల అభ్యర్తన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్తవయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపుకు ముందు జరుగుతుంది.

ఘటం

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.

హైదరాబాద్ -సికింద్రాబాద్ లో పండుగ జరుగు రోజులుగోల్కొండ బోనాలు - 19,జూలై 2015
సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారి బోనాలు -2,3 ఆగస్ట్ 2015
లాల్ దర్వాజ్ బోనాలు - 9,10 ఆగస్ట్ 2015

భాగ్యనగరం లో బోనాల పండుగ ఘనంగా జరిపే దేవాలయాలుశ్రీ జగదంబా మహాకాళి దేవాలయం -గోల్కొండసుమారు 900 సంవత్సరాల క్రితం గోల్కొండ కోట లో గుట్ట పైన వెలసిన క్షేత్రం ఇది . గుట్ట పైన గొర్రెలను మేపడానికి వెళ్ళే కాపరుల ఇక్కడ దేవాలయాన్ని గుర్తించారు . ఆ తరువాత కాకతీయుల కాలం లో , నిజాముల్ కాలం లో ఈ దేవాలయం ప్రాముక్యత తెలియడం జరిగింది . ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే బోనాలు పండుగ ఇక్కడి నుండే మొదలవుతుంది . అంగ రంగ వైభవంగా జరిగే ఆ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తీ శ్రద్ద ల తో నిర్వహిస్తారు .
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం - సికింద్రాబాద్లష్కర్ ప్రజలనే కాకుండా నగర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం . ఒక బక్తుడు తన కోరిక మేరకు నిర్మించిన ఈ దేవాలయం బక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారం గ అమ్మవార్ని కొలుస్తూ ఉంటారు . ఆషాడ మాసం లో జరిగే మహంకాళి జాతర కు లక్షల మంది బక్తులు వస్తారు .


అక్కన్న-మాదన్న మహంకాళి దేవాలయం -హరి బౌలి, ఓల్డ్ సిటీ

17 వ శతాబ్దం లో నిర్మించిన ఈ మహంకాళి అమ్మ వారి దేవాలయ హైదరాబాద్ ని పరిపాలించిన తానీష కాలంలో ఆయన దగ్గర పని చేసిన అక్కన్న -మాదన్న అనే మంత్రివర్యులు . 67 సంవత్సరాల క్రితం దేవాలయన్న్ని పునహ ప్రారంబించిప్రతి నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.భాగ్య నగరం లో జరిగే బోనాల పండుగ ఈ దేవాలయమ లో జరిగే కార్యక్రామలతో పూర్తి అవుతుంది .బాల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం -బాల్కంపేట్భాగ్య నగరం నడిబోడ్డులో గల బాల్కంపేట్ స్వయం భు మూర్తి గ వెలసి ఉన్న దేవలయమే బాల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం. భూమి ఉపరితలమునకు సుమారు 10 అడుగులు దిగువన స్వయం భు గ వెలసి యున్నది . అమ్మవారి మూలస్థానం నుండి స్వకాలం యందు ధరలముగా పవిత్ర జాలం అవిర్బవించుట ఇక్కడి విశిష్టత . కోరిన కోరికలు తీర్చే తల్లి ఎల్లమ్మ తల్లి . అందుకీ ఇక్కడికి బక్తులు బాగా వచ్చి అమ్మవారిని మొక్కు కుంటూ ఉంటారు .

కట్ట మైసమ్మ దేవాలయం -బేగుంపేట్

సుమారు 100 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం భాగ్యనగరం నడిబొడ్డున బేగుంపేట్ లో ఉంది . అమ్మ వారు స్వప్నం లో వచ్చి తనకు మందిరాన్ని నిర్మించని మని చెప్పడం తో ఈ దేవాలయాన్ని నిర్మించారు . కోరిన కోరికలు తీర్చే మహాలక్ష్మి అమ్మవారు ,భాగ్యనగర్ వాసుల ఇలవేల్పు అయి వెలుగుతున్నారు . ప్రతి సంవత్సరం బోనాలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు .
పెద్దమ్మ తల్లి గుడి - జుబ్లిహిల్ల్స్

This temple is located at Jubilee hills. The temple is developed by Mr.P.Janardhan Reddy. This is the temple of goddess. People believe in ‘Amma’. The temple is developing rapidly due to the trust of the people. The devotee prays to Amman as their own mother and believes that she is the rescuer.

భాగ్యనగరం లో వెలసిన మరో పురాతన దేవాలయం ఇది . పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ దేవాలయం ఉండేదట దాన్ని తిరిగి సుమారు 20 సంవత్సరాల క్రితం పునర్నిర్మించరు. ఇక్కడికి ప్రతి నిత్యం చాల మంది బక్తులు వస్తు ఉంటారు. వచ్చి వారి కోరికలు కోరుకొని అవి నెరవేరగానే తిరిగి వచ్చి బొనములను సమర్పించి మొక్కులు తీరుస్తూ ఉంటారు .గండి మైసమ్మ దేవాలయం- మేడ్చల్

This temple is located at gandi maisamma x-road,Near Medchal.

స్వయంబుగా వెలసిన గండి మైసమ్మ దేవాలయం మేడ్చల్ వెళ్ళే మార్గం లో ఉంది . ఇక్కడ కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి .తెలంగాణా రాష్ట్రము లోని ప్రముఖ ఎల్లమ్మ , పోచమ్మ ,మైసమ్మ,పెద్దమ్మ దేవాలయాలు

అదేల్లి పోచమ్మ దేవాలయం - సరంగాపూర్

పెద్దమ్మ దేవాలయం -పాల్వంచ

Maisigandi Maisamma Temple

Yellamma Temple,alladurg

Renuka Yellamma Temple,Nizamabad