ఏకాదశి రోజున మహావిష్ణువును దర్శించుకుంటే...


"అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం"
"హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్"
అటువంటి సుందరమూర్తి అయిన శ్రీ మహావిష్ణువును ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, విష్ణుమూర్తికి పంచహారతులిచ్చి నిష్ఠతో ప్రార్థించే వారికి ఈతిబాధలు, దారిద్ర్యం తొలగిపోతాయని వేద పండితులు అంటున్నారు.
ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున మాత్రమే కాకుండా, విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ప్రసిద్ధి వైష్ణవక్షేత్రాల్లో మహావిష్ణువును దర్శించుకునే వారికి పాపాలు తొలగిపోయి, సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం.