ఈర్ష్య, అసూయల్ని జయించడం ఎలా?


ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈర్ష్య, అసూయల్ని జయిండం సాధ్యపడదు. అయితే, సాధన చేస్తే సాధ్యపడని సంగతే ఉండదన్న సూత్రాన్ని ఇక్కడ అనువర్తింపజేసుకోవచ్చు.
సాధారణంగా అనేకానేక కారణాల వల్ల ఒక మనిషి భావోద్వేగాల్లో ఈర్ష్య, అసూయలు కూడా అంతర్భాగాలు. తమకు లేనిది ఇతరుల వద్ద ఉంటే.. తమకన్నా వారు అధికులు అనుకున్నా ఈ భావాలు చుట్టుముట్టేస్తాయి. అలాంటి వారిలో బంధువులు, స్నేహితులు, అయినవారు.. ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావొచ్చు.. వారి పట్ల ఏదో ఒక సందర్భంలో ఈర్ష్య కలుగుతుంది.
ఇలాంటి పరిస్థితిని నుంచి అధికమించాలంటే మనలోని గుణాల్ని తప్పక వెలికి తీసుకోవాలి. వాటికి సానబెట్టి ఇతరుల్లో లేని మంచి మనలో ఏముందో అన్వేషించాలి. అపుడు మనకు లేనిది ఇతరుల వద్ద ఉందనే ఈర్ష్యకు తావుండదు.