గరుత్మంతుడి దర్శనం లభిస్తే మంచిదా?


గరుత్మంతుని దర్శనం అంత సామాన్యంగా లభించదు. పక్షులకెల్లా ఉత్తమమైన గరత్మంతుడిని చూడటం శుభ శకనమా అని తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రయాణమై వెళ్తున్నప్పుడుగానీ, కార్యార్థమై ఇంటి నుంచి బయల్దేరు సమయంలోగానీ గరుడపక్షి తనకు కుడి నుంచి ఎడమపక్కకు పోయినట్లైతే కార్యభంగమై అనుకోని ఆపదలు సంభవిస్తాయి.
అయితే ఎడమవైపు నుంచి కుడిపక్కకు బోయినట్లైతే శ్రీఘ్రముగా సకల కార్యములు నెరవేరి లాభము ప్రాప్తించగలదు. గరుత్మంతుడు తనచుట్టూ చక్రమువలె తిరుగుచున్నట్లైతే ఊహించని ఉపయోగములు ప్రాప్తించి ధన-ధాన్య సంపదలు వృద్ధి చెందగలవు.
ప్రభాత సమయంలో నిద్రలేచిన వెంటనే తొలిచూపులోనే గరుడ దర్శనము జరిగినట్లైతే ఆయుష్షు వృద్ధికావడమే గాకుండా అతి త్వరితకాలంలో శుభఫలితాలు, సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.