గోదాదేవిని స్మరించండిలా..


శ్రీ విష్ణుచిత్తకుల నందన కల్పవల్లీం
శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యామ్!
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాన్యాం
గోదామనన్య శరణశ్శరణం ప్రపద్యే!!
"శ్రీవిష్ణుచిత్తుని కులనందన కల్పవల్లిని, శ్రీరంగనాథుడు ధరించే హరించనానిని సాక్షాత్తు క్షమకు, కరుణకు ఆలవాలమైన ఓ గోదాదేవీ నిన్నుతప్పమరెవరిని శరణుకోరేది. నన్ను రక్షించు తల్లీ" అని శనివారం పూట వేడుకునే కన్యలకు మనస్సుకు నచ్చిన వాడే పతిగా వస్తాడని పండితులు అంటున్నారు.
శనివారం తెల్లవారుజామున ఆరుగంటల ప్రాంతంలో శుచిగా స్నానమాచరించి గడపన దీపమెట్టి.. ఆలయంలోనూ నేతితో దీపమెలిగించే వారికి మనస్సుకు నచ్చినట్లే వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.