శ్రీ రాజ రాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి దేవా స్థానం - కోటిపల్లి
శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ద్రాక్షారామానికి దగ్గరలో ,పరమ పావనమైన పుణ్య గౌతమీ నది తీరం లో వెలసి ఉంది . సిద్దులను అనుగ్రహించి కశ్యప మహర్షి చే ప్రతిష్టించబడిన శ్రీ సిద్ది జనార్ధన స్వామి , ఇంద్రుని చే ప్రతిష్టించబడిన శ్రీ కోటేశ్వర స్వామి ,చంద్రుని చే ప్రతిష్టించబడిన శ్రీ సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారు . కోటిపల్లి క్షేత్రం మహత్యం గురుంచి బ్రహమండ పురాణం మరియు గౌతమీ మహత్యం లో తెలియచేయడం జరిగింది .


గౌతమీ నది లో స్నానం ఆచరించి కోటిపల్లి క్షేత్రాన్ని సందర్శించిన కోటి పుణ్య ఫలాలు దక్కుతాయి . బాదలు అన్ని తొలిగిపోతాయని పురాణం గాథ.


శ్రీ సిద్ది జనార్ధన స్వామి : -
రాక్షస రాజు బాలి చక్రవర్తి నుండి కాపాడుకోడానికి దేవతలంత కలిసి కశ్యప మహర్షిని వెంటబెట్టుకొని శ్రీమాన్ నారయనముర్తి తపస్సు చేసుకుంటున్న ఈ క్షేత్రానికి వచ్చి వేడుకోగా అప్పుడు స్వామి వారు కశ్యపుడి బార్య అదితి గర్భమన వామనమూర్తి గ అవతరించి బలి నుండి సమస్త రాజ్యమును దానముగా స్వీకరించి దేవతలకు ఇచ్చి తిరిగి తపస్సు చేసుకోడానికి ఈ క్షేత్రం చేరాడట . కశ్యప మహర్షి శ్రీ సిద్ది జనార్ధన స్వామి ని ప్రతిస్తిన్చాడట . శ్రీ భూదేవి ,శ్రీదేవి సహిత జనార్ధన స్వామి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నారు .


కోటేశ్వర లింగం : -
స్వర్గాదిపతి ఇంద్రుడు గౌతముని బార్యను మోహించి తనతో ఉండడం వలన గౌతముడు ఆగ్రహించి ఇంద్రునికి ,అహల్య కు శాపం ఇవ్వాగా ,ఇరువురు తమను మన్నించమని వేడుకోగా అప్పుడు గౌతముడు ఇలా చెప్పెను . శ్రీ రాముడి పాదస్పర్శ చే అహల్య , కొటిశ్వర లింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిస్తించటం వలన శాప విముక్తి లబిస్తుంది అని ఇంద్రునికి చెప్పగా అలా ఇంద్రునే చే ప్రతిస్టించబడినది అని స్థల పురాణం
శ్రీ చాయ సోమేశ్వర స్వామి :
పూర్వం చంద్రుడు అజ్ఞానం తో తన గురుపత్ని ఆయన తార ను మోహావేశం తో పొందాడు దానికి పాపంగా చంద్రుడు తన సహజ సిద్దమైన వెన్నెల చాయను కోల్పోయి క్షయ వ్యాది గ్రస్తుడయ్యేను .చంద్రుడు మిక్కిలి బాదతో తపస్సు చేసి విష్ణుమూర్తి ని వేడుకోగా అప్పుడు విష్ణు నివారణోపాయం చెప్పను . కోటితీర్థం క్షేత్రం లో గౌతమీ నది లో స్నానానం ఆచరించి జనార్ధన స్వామి ని దర్శించి పార్వతి సహిత సోమేస్వరలిన్గాన్ని ప్రతిస్టించమని ,కోటి బిల్వలతో ప్రార్థించి పాపవిముక్తడవు అవుతావు అని ఆదేశించాను . చంద్రుడు ఆ విదంగా చేసిన కోల్పోయిన చంద్రకాంతి చాయను పొందాడు అందుకే క్షేత్రానికి ఛాయా సోమేశ్వర లింగ క్షేత్రం అని పేరు వచ్చింది . స్వామి వారి రాజ రాజేశ్వరి సహితంగా ఇక్కడ కొలువై ఉన్నారు .ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మహా శివరాత్రి ఉత్సవాలు ,స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ( వైశాక శుద్ధ ఏకాదశి )
నవరాత్రి ఉత్సవాలు ,క్షీరాబ్ధి ద్వాదశి తెప్పోత్సవము ( కార్తీక మాసం )
వెళ్ళు మార్గం
---------------------
కాకినాడ నుండి 38 కి మీ ,రాజముండ్రి నుండి 60 కి మీ ,అమలాపురం నుండి 15 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది .