పరోపకారమే ముక్తి కి మార్గం


'మానవ సేవ' ఎంతటి మహత్తర సేవో అనేక ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. నేటి సమాజంలో ఎందరో వ్యాధిగ్రస్తులు, అన్నార్తులు, దుస్తులేని అభాగ్యులు మనకు తారసపడుతుంటారు. ఇంటి గుమ్మం ముందుకు వచ్చి 'బిక్షాందేహి' అనగానే మనం చాలా నిర్లక్ష్యంగా వెళ్లు వెళ్లమని ఈసడించుకొంటాం.
సహాయానికి అర్హులైన ఎందరో అభాగ్యులు మన కళ్లకు కనిపించినా, మనం వాళ్లను పట్టించుకోకుండా ముందుకు సాగుతాం. కానీ, అన్నార్తుల ఆకలి బాధను తీర్చడం, దాహార్తుల దాహం తీర్చడం, దుస్తులు లేని వాళ్లకు దుస్తులను సమకూర్చడం, వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించి, వీలైతే వారికి వైద్య సదుపాయాన్ని కల్పించడం వంటి సత్కార్యాలు మనల్ని దైవానికి చేరువ చేస్తాయి.
ఆర్తులను కాదని మనం ఎన్ని యాగాలు, ధ్యానాలు చేసినా, ఎన్ని నోములు, వ్రతాలు పాటించినా యోగం సిద్ధించదు. పరలోకంలో దైవదర్శనభాగ్యం లభించదు. కాబట్టి మానవ సేవలోనే మానవ ముక్తి మోక్షాల రహస్యం దాగుందనే సత్యాన్ని గ్రహించాలి.