రామాయణ పారాయణం


రామాయణ పారాయణం భారతీయులకు నిత్యకృత్యం ! ఎక్కడైతే రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ ఎల్లప్పుడు సుఖ సంతోషాలు వేల్లువిరుస్తాయి !! లోకములోని సమస్త ఉత్తమ గుణాలకు ,ధర్మాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. భారత జాతి ఆత్మారాముడు అందుకీ ఈ జగమంతా రామమయంగా బావిస్తోంది!! రామాయణం వ్యక్తి ధర్మం ,కుటుంభ ధర్మం , సంఘ ధర్మం అను త్రివేణి ధర్మ సంఘమంగా చెప్పుతారు నేటి సమాజం లో అంతకంతకు అంతరించిపోతున్న నైతిక విలువల బలం పుంజుకోవాలంటే రామాయణ పటనం అనివార్యం. రామాయణం భారతీయ సంస్కృతికి పుట్టినిల్లు .