సత్ప్రావర్తన


సత్ప్రవర్తన మానవుణ్ణి అన్ని విధాలా తప్పక రక్షిస్తుంది. దానికి సందేహంలేదు. సత్ప్రవర్తన లేని మానవుడు మానవుడే కాదు. రాక్షసుడనబడుతున్నాడు. మంచి శీలం కలవాడు ఓర్పు, దయ, శాంతము, వినయము, భక్తి, గురువుల వద్ద గౌరవము అహింస సద్భావము, ఇంద్రియనిగ్రహము, తృప్తి సదాచారం ఇటువంటి మంచి గుణాలు కలిగివుంటారు.
సత్ప్రవర్తన వల్ల సుఖం లాభం, కీర్తి, శాంతి, జ్ఞానం, దైవానుగ్రహం కలుగుతాయి. సౌశీల్యంగల వారు సమాజంలో గౌరవింపబడతారు. పూజించబడతారు. సౌశీల్యంహల వారికి ఎక్కడా ఎదురుండదు. పరలోకంలో ఉత్తమగతిని పొందవచ్చు. కాబట్టి మానవులు సౌశీల్యమును కలిగివుండాలి.