శనీశ్వరుడిని మనసారా పూజించండి


"ఆదిత్యాయ చ సోమాయ మంగాళయ బుధాయచ
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః "
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
అందుచేత శనివారం పూట సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శనీశ్వరుడికి పూజ చేయడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. శనివారం సాయంత్రం నవగ్రహాలయాలకు వెళ్లి, రెండు నల్లటి ప్రమిదలతో నల్లటి వత్తులను ఉంచి నువ్వులనూనెతో దీపమెలిగించడం మంచిది.
గృహంలో శనివారం సాయంత్రం ఆరుగంటలకు నుదుట నల్లటి కుంకుమ ధరించి, ఆవునేతితో పంచహారతులిచ్చి, "ఓం శం శనయే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈతిబాధలు, శనిగ్రహదోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.