బ్రహ్మచే పూజలందుకున్న పంచముఖ నాగలింగేశ్వరుడు!


దక్షిణ కైలాసం, దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరంలో వెలసిన పంచముఖ నాగలింగేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మదేవునిచే పూజలందుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశంలో పంచభూత లింగములలో, శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగంగా ప్రసిద్ధి చెందిన విషయం మనకందరికీ తెలుసు..!.
అలాగే ఒక ప్రళయం తర్వాత, వాయుదేవుడు శ్రీ కాళహస్తిలోని పరమశివుని దర్శించి, పచ్చ కర్పూర తీర్థంతో అభిషేకించాడని పురాణులు చెబుతున్నాయి. ఆనాటి నుంచే శ్రీకాళహస్తిలోని శివలింగం వాయు లింగంగా పేరుగాంచింది.
ఇంకా చెప్పాలంటే..! శ్రీకాళహస్తిలో వాయులింగంగా వెలసిన మహేశ్వరుడు.. భక్త కోటిని అనుగ్రహించేందుకు పంచముఖ నాగలింగంగా వెలశాడని పురోహితులు చెబుతున్నారు. ఈ పంచముఖ నాగలింగం ఎలా ఉత్పత్తి అయ్యిందంటే..? పూర్వం వశిష్ఠ మహాముని, తన పుత్ర శోకాన్ని తొలగించుకోవడానికి నిశ్చల భక్తితో తపస్సు చేశాడు.