Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

అక్కన్న -మాదన్న దేవాలయం – శాలిబండ




హైదరాబద్ లో వెలసిన మరో మహిమన్మితమైన ,శక్తివంతమైన మాహ కాళి అమ్మవారి దేవాలయం అక్కన్న -మాదన్న దేవాలయం .


17 వ శతాబ్దంలో హైదరాబాదు ను పారిపలించిన తానీషా రాజు వారి కాలం లో అయన దగ్గర పని చేసిన అక్కన్న -మాదన్న మంత్రివర్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు అని చెబుతారు .వారిలో ఒకరు సైనికాధికారిగానూ మరొకరు ప్రధాన మంత్రిగానూ ఉండేవారు.వీరు మహాకాళీ యొక్క భక్తులు. వారు ప్రతిరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు పూజలు చేసిన తర్వాతనే రాజాస్థానానికి (గోల్కొండ) కు హాజరయ్యేవారు.వారి మారనంతరం దేవాలయం కొన్ని సంవత్సారాలు మూయబడినది.



67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం సాలిబండ వద్ద పునః ప్రారంభించబడినది. ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.



బోనాల పండుగ కార్యక్రామాలు గోల్కొండ తో మొదలై అక్కన్న-మాదన్న మహాకాళీ దేవాలయం తో పూర్తి అవుతాయి .