Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

చిల్కూర్ బాలాజీ దేవాలయం
భాగ్యనగారానికి అతి సమిపమ లో వెలిసిన వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు చాల సులువు గ నేరవేరుస్తాడు అని నమ్మకం .. ఇక్కడ స్వామి వారు సుమారు 500 సంవత్సరల క్రితం ఒక భక్తుడికి ప్రత్యక్షమై ఆ తారువాత గుడి నిర్మించబడి పూజలు అందుకుంటున్నాడు!!


స్థల పురాణం :
ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.


1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.
ఇక్కడ స్వామి వారికి భక్తుల నుండి ఎటువంటి ధన రూపం లో ఉన్న కానుకలను ఇవ్వరు. ఇక్కడికి వచ్చే భక్తులను శ్రద్దగా 11 ప్రదిక్షణలు చేసి కోరికను కోరుకుంటారు .కొరిన కోరిక తీరిన తరువాత వచ్చి 108 ప్రదిక్షణలు చేసి స్వామి వారిని దర్సించుకున్తారు. కోరిన కోరికలను నెరవేర్చే స్వామి వారిని దర్శించుకోవడం మన పూర్వ జన్మ సుకృతమే !!భక్తులు ఇక్కడ జపించే మంత్రాలూ
(1) ఓం అక్షరయనమః (విద్యాభిరుద్దికి -28)
(2) ఓం వషట్కారయనమః (వ్యాపారభిరుద్దికి,ఇంటర్వ్యూ లలో సపలం కావడానికి -28)
(3) ఓం పుష్కరక్షయనమః (కష్టాలనుండి విముక్తికి -108)
(4) ఓం భుతభావనయనమః (మంచి ఆరోగ్యానికి -28)
(5) ఓం నారసింహవపుశయయనమః ( ఆపదలో ఉన్నప్పుడు -108)
(6) ఓం క్షేత్రగ్నయనమః ( స్వంతగా ఇండ్లు,ప్లాట్లు కొనాలి అనేవారు -108)
(7) ఓం భుతదాయే నమః (మిత్రులతో స్నేహబవాన్ని పెంచుకోడానికి)
(8) ఓం శర్మనేనమః (అన్క్త బావం కోసం-28)
(9) ఓం నమో నారాయనయనమః
(10) ఓం జ్యోతిష్స్సంపతయనమః (స్పష్టమైన చూపు కొరకు-108)
(11) ఓం స్తవిస్ట్యయనమః (దుష్ట శక్తుల నుండి కాపాడుకోడానికి -108)


వెళ్ళు మార్గం : హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు కలవు. అవేకాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి. మెహిదీపట్నం నుండి 288D బస్సు ఎక్క వలెను. ప్రయాణ సమయం గంట.


Route Map:-