Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం -గూడెబల్లూరు
కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కి 15 కి మీ దూరం లో గూడెబల్లూరు గ్రామం లో వెలసిన ప్రసిద్ద స్వయం భు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురతనమైన దేవాలయం . మాండవ్య మహర్షి కోరిక తీర్చడానికి స్వయం గ వెంకటేశ్వర స్వామి, లక్ష్మి దేవి ఈ గుట్ట పైకి వచ్చి మహర్షి కోరిక నెరవేర్చారు అని స్థల పురాణం !!
పూర్వం ఈ ప్రాంతాన్ని గుండిలపురం అని పిలువబడేది .చైత్రమాసం లో ఇక్కడ 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మన రాష్ట్రము నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాల మంది బక్తులు ఇక్కడికి వస్తు ఉంటారు . చాల మహిమన్మితమైన క్షేత్రం ఇది .


Route Map:-