Share This on Your Social Netowrk


శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం -హంసలాదీవి
వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కృష్ణ జిల్లాలోని హంసలదీవి లో ఉంది . సహ్యాద్రి పర్వత శ్రేణులలో ప్రబవించిన కృష్ణ నది కృష్ణ జిల్లాలోని పులిగడ్డ దగ్గర రెండు పాయలుగా వీడిపోయి ఎడమ పాయ శివకేశవ క్షేత్రమైన హంసల దీవి దగ్గర సముద్రం లో కలుస్తుంది .


అద్బుతమైన శిల్పకళ , చక్కడి కట్టడాలతో నిర్మించిన ఈ దేవాలయం సముద్రపు అటు పోటులను తట్టుకునేల ప్రాకారాన్ని నిర్మించారు . తూర్పు ముఖాన అద్బుతమైన రాజగోపురం ఉంటుంది దిన్నె గాలిగోపురం అంటారు . ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి . ఆలయం చుట్టూ ఎన్నో అంద మైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఆలయా నికి ఈశాన్యంలో పురాతన కట్టుబడితో కళ్యాణమండపం కన్పిస్తుంది.


ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీ కృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో స్వామి కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరపర్తి వెళ్ళి ఓ గృహస్థుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకర పర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్టించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.


ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా ,కనుల పండుగగా జరుగుతాయి .
ఒకసారి ఇద్దరు గందర్వులు ఆకాశయానం చేస్తూ కృష్ణ నది ప్రాంతానికి చేరుకునే సరికి అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటుండగా అతని నల్లని శరీరాన్ని చూసి పరిహాసం చేసారట ఆగ్రహించిన మహర్షి కాకులుగా మారుతారు అని శపించారట. ఆ గందర్వులు తమ తప్పున క్షేమించమని కోరగా కృష్ణ నది ప్రవహించే ప్రాంతం లో మీరు స్నానం చేస్తే ఏదో ఒక తీరం లో మీకు కాకుల రూపం పోయి హంసల రూపం వస్తుంది అని నివారణోపాయాన్ని చెప్పారట అల అన్ని క్షేత్రాల్లో స్నానం చేస్తూ ఈ ప్రాంతానికి రాగానే వారి ఆకృతి మారిపోయిందట అందుకే ఈ క్షేత్రానికి హంసలదీవి అని పేరు వచ్చింది అని స్థల పురాణం చెబుతుంది . మరొక కథనం ప్రకారం ప్రతి రోజు రాత్రి వేల యోగిస్వరులు హంసల రూపం లో ఇక్కడికి వచ్చి కృష్ణ నది లో స్నానం చేసి వేణుగోపాల స్వామి ని సేవించే వారు అని అందుకే ఈ ప్రాంతానికి హంసలదీవి అని పేరు వచ్చింది అని చెబుతారు .

ప్రత్యేక పూజలు
మాఘపౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాదిమంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.
వెళ్ళు మార్గం

కృష్ణాజిల్లా కోడూరు నుండి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోను బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.

Route Map : -