Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ ప్రసన్న కామాక్షి సమేత శ్రీమొగిలీశ్వరా లయం- మొగిలి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలోని బంగారు పాళ్యం మండల పరిధిలోని అటవీ ప్రాంతా నికి దగ్గరగా దక్షిణ కాశీగా పేరొందిన మొగి లి గ్రామం కూడా ప్రసిద్ధమైనదే. ఇక్కడ వెలసి న శ్రీ ప్రసన్న కామాక్షి సమేత శ్రీమొగిలీశ్వరా లయం ఎంతో ప్రసిద్ది చెందినా శైవ క్షేత్రం .


ప్రతి ఏడాది మహశివరాత్రి సందర్భంగా పది రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ బ్రహ్మో త్సవాలకు చిత్తూరు జిల్లా వాసులేగాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.


దేవాలయం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, ప్రకృతి ప్రసాదించినట్లుగా చల్లటి గాలితో ఆహ్లాదకరంగా కనిపించే వాతావరణం వుంటుంది.


ప్రస్తుతం పుష్కరిణిగా ఉన్న ప్రదేశంలో మొగిలిపొద ఎక్కువగా ఉండేది. ఈ పుష్కరిణిలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా నంది విగ్రహం నోటి నుంచి నీరు కరువులోను నిరంతరాయంగా వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ అంతుబట్టలేదు. అప్పట్లో ఓ మొగిలి పొదలు మధ్య ఒక నీటి దారువ ఉండేదని, మేత మేసిన పశువులు ఈ పొదల మధ్య సేద తీర్చుకొని పక్కన ఉన్న నీటి ధారలో నీళ్ళు తాగుతూ ఉండేవని చెబుతుంటారు. ఒక రోజు నీటి ధారలో నల్లటి రాయి పశువులు తాగే నీటికి అడ్డు రావడంతో మొగిలప్ప ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. ఆ రాయి కదలక పోవడంతో తన వద్దనున్న గొడ్డలతో రాయిపైకొట్టగా ఆ దెబ్బకు ఆ రాతి నుంచి రక్తం కారడంతో భయభ్రాంతులకు గురయ్యాడు. దెబ్బ తగిలిన ఆ రాతికి అతను ఆకు పసురుతో చికిత్స చేసి ప్రతి రోజు భక్తితో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.


మొగిలప్పకు చెందిన ఆవుల్లో ఒక ఆవు పాలు పితకనివ్వక తంతూ గ్రామానికి దక్షిణ దిశలో మూడు కిలో మీటర్లుదూరంలో గల దేవర కొండకు వెళుతూ ఉండేది. ఆ రహస్యం తెలసుకోవడానికి ఓ రోజు మొగిలప్ప ఆవును వెంబడించగా ఆవు కొంతదూరం వెళ్ళి స్వరంగ మార్గం గుండా వెళ్ళింది. ఆ ప్రదేశంలో సాక్షాత్తు కైలాసాన్ని మరుపింప చేసే అద్బుత దృశ్యాన్ని చూసి చీకట్లో అలాగే నిశ్చేష్టుడై ఉండి పోయాడు. పార్వతి దేవి అక్కడ ఉన్న శివలింగానికి పాలభిషేకం చేస్తూ చీకట్లో నిలబడి ఉన్న మొగిలిప్పను చూసింది. అందుకు భయభ్రాంతులకు గురైన మొగిలప్ప శరణు కోరగా ఈ రహస్యాన్ని ఎక్కడా బయటకు చెప్పరాదని చెప్పింది. దీంతో అతను దైవ చింతనా పరాయణుడిగా మారిపోయాడు. భర్త దైవచింతనను గమనించిన భార్య గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించింది. తాను నిజం చెబితే మరణిస్తానని మొగిలప్ప ఎంత చెప్పినా వారు వినకపోవడంతో విధిలేని పరిస్ధిలో మొగిలప్ప చితిపేర్చమని చెప్పి, చితిపై కూర్చోని తాను చూసిన సంఘటలన్నీ వివరించాడు. వెంటనే మొగిలప్ప తల పగిలి మృతి చెందాడు. ఇతని పేరుమీదనే ఈ దేవాలయంలోని దేవునికి మొగిలీశ్వరుడు అనే నామం ఏర్పడింది.Route Map:-