Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ కుర్మనాథ వేణుగోపాల స్వామి దేవాలయం - పెద్దకపవరం




పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెదకాపవరం అనే గ్రామంలో నెలకొన్న శ్రీ కూర్మనాథ వేణుగోపాలస్వామి దేవాలయం 16 వ శతాబ్దం నాటిది . మన రాష్ట్రము లో శ్రీ కూర్మం తరువాత అంత విశిష్టమైన దేవాలయం ఇదే . శ్రీ మహా విష్ణువు రెండు అవతరలైన వేణుగోపాల స్వామి , కుర్మా అవతారం ఒకే దగ్గర చూడాలి అంటే తప్పకుండ అందరు చూడవలసిన ప్రదేశం ఇది .


శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామి వారి రూపం వెనక కొంత చరిత్ర ఉంది. అది తెలిస్తే గాని ఈ స్వామి రహస్యం ఏంటో తెలియదు. 16వ శతాబ్దంలో ఆనాటి పాలకులు సస్యసంపన్నమైన పెదకపవరంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు రెండువందల సంవత్సరాలు ఆ వంశంవారే ధర్మకర్తలుగా వ్యవహరించి స్వామికి సకలభోగాలు జరిపిస్తూ వచ్చారు.
18వ శతాబ్దం చివరి రోజుల్లో ఆలయ ధర్మకర్తగా కఠారి శేషన్నగారు వ్యవహరించారు. వారు స్వామికి పరమభక్తులు, ఒక శుభరాత్రివేళ శ్రీ వేణుగోపాలస్వామి శేషన్న గారికి కలలో కన్పించారు. స్వామివారి దివ్యమంగళరూపం క్రమంగా కూర్మావతారాన్ని సంతరించుకుంది. శేషన్నగారికి కొన్ని సూచనలు చేశారు.


నిద్రలేచిన శేషన్న తన స్వప్న వృత్తాంతాన్ని గ్రామస్థులందరికీ చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం అందరూ ఒక్కటిగా చేరి భగవన్నామ సంకీర్తన ప్రారంభించారు. అందరూ గొంతెత్తి కీర్తించే సమయంలో ఒక గరుడుపక్షి ఆకాశంలో కన్పించింది. భక్తులందరూ లేచి మేళతాలాలతో ఆ పక్షిని అనుసరించి, ఒక అర మైలు దూరం వెళ్ళాక ఒక మట్టిదిబ్బమీద గరుడపక్షి వాలింది.
అందరూ ఆ ప్రదేశాన్ని తవ్వారు. అందులో శేషన్నగారికి స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీ కూర్మరూపం కన్పించింది. వారి ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా ప్రతిష్టించబడిన శ్రీ కూర్మనాథ వేణుగోపాలస్వామి రూపం మరెక్కడా కనిపించదు. ఆనాటి ఉయ్యూరు ఎస్టేట్ జమీందారులు 50 ఎకరాల ఈనాము స్వామికి దానమిచ్చారు.
ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించనీయమైన స్థలం ఇది .మహిమన్మితమైన, రమణీయమైన క్షేత్రం





---------------------
Route Map:-