Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు
నెల్లూరు జిల్లా పెన్నా నది తీరన వెలసిన ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం. ఆది శేషువు శ్రీ మహా విష్ణువు ఆనతి మేరకు భూలోకంలో పవిత్ర పెన్నా నదీ తీరంలో గిరిగా నిలవగా స్వామి విశ్రాంతి తీసుకొంటున్నారు అన్న కారణం గా "తల్ప గిరి " అన్న పేరు వచ్చినట్లుగా స్థానిక గాధల ఆధారంగా తెలుస్తోంది. తల్పగిరి ఉత్తర శ్రీ రంగం గా ప్రసిద్ది చెందినది.


పల్లవులు 7 వ శతాబ్దం లో విగ్రహన్ని ప్రతిస్తించగా 12 వ శతాబ్దం లో చోళులు పాత నిర్మాణాలు పునః నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామి శయన భంగిమలో సర్వాంగ సుందర అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు.తూర్పు దిశగా చూస్తూ కుడి చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని కనపడే స్వామి ఇక్కడ ఎడమ చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని పడమర దిశను చూస్తుంటారు.


రెండువందల సంవత్సరాల క్రిందట స్థానిక భక్తులు తూర్పు దిశలో నిర్మించిన ఏడు అంతస్థుల రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ప్రవేశ ద్వారం పైన నారద తుంబుర గానం వింటూ శేష తల్పం పైన సేద తీరుతున్న శ్రీ శేష శయనుడు ఉంటారు. ఆలయ రెండో ప్రకార గోడల పైన శంకు చక్ర తిరునామాలు పైన సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామ చంద్ర మరియు రుక్మిణి సత్య సమేత శ్రీ కృష్ణ రూపాలను చక్కగా మలచారు.


ప్రధాన ఆలయం పడమర దిశగా ఉండగా లోపలి దక్షిణ ద్వారం గుండా వెళ్ళాలి.ఈ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు, పైన శ్రీ దేవి భూ దేవి సహిత శ్రీ మన్నారాయణ విగ్రహాలను సుందరంగా చెక్కారు ఇక్కడే శ్రీ రంగ నాయకీ అమ్మవారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది.
చిన్న పురాతన గోపురం నది వైపుకు దారి తీస్తుంది.నదీ తీరంలో మహా భారతాన్నితెలుగులో రచించిన కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి విగ్రహం ఉంటుంది. దక్షిణాన నూతనంగా నిర్మించ బడిన ఆలయం లో కలియుగ వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనోహరంగా'దర్శనమిస్తారు. ఉత్తరాన వైకుంఠ ద్వారం, శ్రీ ఆండాళ్ సన్నిధి ఉంటాయి. నిత్యం ఎన్నో పూజలతో సంపూర్ణ విశ్వాసంతో తరలి వచ్చే భక్తులతో నిత్య తోరణం పచ్చ కళ్యాణంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుకొని ఉంటుంది తల్పగిరి ఆలయం.

ప్రత్యేక కార్యక్రమాలు :-
మార్చి -ఏప్రిల్ ( చైత్ర మాసం )మధ్య కాలంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం లో ఇక్కడ విశెసమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .
వెళ్ళు మార్గం :-
నెల్లూరు నుండి ప్రతి గంట కు ,రాపూరు నుండి అరగంట కు ఒక బస్ సర్వీస్ ఈ క్షేత్రానికి ఉంటుంది .Sri Ranganathaswamy Temple, Ranganayakula Pet Road, Ranganaykulapet, Nellore, Andhra Pradesh-524 001. How to reach

By Bus: Buses are available from all major cities in Andhra Pradesh to Nellore which is 3 km away from the temple. Local buses are available to reach the temple.

Route Map:-