Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

పోలేరమ్మ దేవాలయం, వెంకట గిరి




నెల్లూరు జిల్లాలోని వెంకట గిరి లో వెలసిన పోలేరమ్మ దేవాలయం ఎంతో పురాతనమైనది మరియు చారిత్రకమైన దేవాలయం . ఆలయం లో వెలసిన అమ్మవారు శక్తి స్వరుపుని . కోరిన కోరికలు తీర్చు కొంగు బంగారం . వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఉరి ప్రజల గ్రామా దేవతగ పూజలు అందుకుంటుంది.


గ్రామం లో జరిగీ అమ్మ వారి జాతర కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది . గ్రామా ప్రజలే కాకుండా చుట్టూ పక్కల నుండి కూడా లక్షల మంది భక్తులు పాల్గుంటారు . వేంకటగిరి సంస్థానాదీశులు కాలం లో నిర్మించబడిన ఈ దేవలయం ఎంతో చారిత్రక వైభవాన్ని కూడుకున్నది. వెంకటగిరి సంస్ధానాదీశులలో 33తరాల వారు పోలేరమ్మ జాతరను జరిపించడం విశేషం. 1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది.


వెంకటగిరి పట్టణము నేత చీరలకు మరియు పోలేరమ్మ జాతరకు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభావం గా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం మరియు గురువారం న జరుపుకుంటారు.



Route Map:-