ఏరువాక పౌర్ణమి


మనకు అన్నం పెట్టె రైతన్నలకు,గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికి , మనందరికీ ఎంతో ప్రీతీ పాత్రమైన రోజు జ్యేష్ట శుద్ధ పౌర్ణమి.మనకు అన్నం పెట్టె రైతన్నలకు,గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికి , మనందరికీ ఎంతో ప్రీతీ పాత్రమైన రోజు జ్యేష్ట శుద్ధ పౌర్ణమి. జ్యేష్ట శుద్ధ పౌర్ణమి పౌర్ణమి రోజునే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు .ఈ రోజున రైతులు పొలాలు దుక్కు దున్ని రాబోయే వర్షాకాలానికి పంటలు వేసుకోడానికి సిద్దంగా ఉంచుకుంటారు . ఈ దినమున రైతులు వ్యవసాయానికి వాడే పరికరాలను అన్ని శుబ్రం చేసుకొని ,చూడ చక్కగా అలంకరించి ,అలాగే బసవన్నలను శుబ్రం చేసి,రంగు రంగు రంగులతో అలంకరించి,వాటికి దిష్టి తగలకుండా మేడలో గంటలు వేసి , బాజా బజంత్రిలతో పొలానికి తీసుకోని వెళ్లి భూమిని దుక్కి దున్ని ఏరువాక ప్రారంబించే శుభా దినము . ఇలా చేయడం వలన పంటలు బాగా పండుతాయని ,సిరి సంపదలతో ,సుఖ సంతోషాలతో ఉంటారు అని విశ్వాసం . గోపలురుకు గిరి యజ్ఞం ,కర్షకులకు ఏరువాకా యజ్ఞముగా ,బ్రాహ్మణులకు మంత్రం జపమే యజ్ఞముగా చేయుదురని విష్ణు పురాణం తెలియచేస్తున్నది . ఏరువాక పౌర్ణమి చాల ప్రాచీనమైన పండుగ .