Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

గురు పౌర్ణమి( వ్యాసపూర్ణిమ)




గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"



దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి ని జరుపుకుంటాము . ఆ రోజు వ్యాస మహర్షి పుట్టిన రోజు కావడం .. ఆ రోజు నుండి చాతుర్మాస్య దీక్ష ప్రారంబం అవుతుంది . పూర్వ కాలం లో ఆ రోజు నుండి 4 నెలలు వర్ష కాలం కావడం తో అందారు ఆశ్రమాలలో ,గురుకులాల్లో ఉంది విద్యని అభ్యసించేవారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.



గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.
వేదాలను నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలోఒకడు.


ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు


దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


వ్యాసుని జన్మ వుత్తాంతము :



వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వంతృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.


పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పడెస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు , వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ ద ొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు ని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.

దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది స్నానానికి అక్కడ కు వస్తాడు. పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు . ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ని్యమాలు ఇలా ఉనాయిట :-

దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి ,
బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి ,
వదువు కన్య అయి ఉండాలి ,
వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి ,
లంక లో పెండ్లి జరగాలి ,
పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి ,
ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి , బ్రహ్మసమానుడై ఉంటాడని అలోచిస్తూ నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ... తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి చుట్టు చూడగా ......అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న జన్మరహస్యాన్ని వివరిస్తాడు . అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది ... అని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది , బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా ... తన శక్తి స్వరూపాలతో పుట్టె బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా చెప్పడం తో , నారదముని సహయము తో వివాహం జరిపించి ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు .ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

భారతంలో వ్యాసుని పాత్ర :



వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరవాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరవాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరవాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరవాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచిం చి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరవాత లక్క ఇంటి దహనం తరవాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలదని సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరవాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ సాయిబాబా మందిరాలు కొన్ని



షిరిడి సాయిబాబా దేవాలయం -బలభద్రాపురం







తూర్పు గోదావరి జిల్లా బలభద్ర పురం లో వెలసిన శ్రీ సాయిబాబా దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది . ఈ దేవాలయాన్ని ఆంధ్ర షిర్డీ అని కూడా పిలుస్తారు .

సాయిబాబా దేవాలయం -మచిలీపట్టణం





పట్టాన కేంద్రం లో వెలసిన సాయిబాబా దేవాలయం ఎంతో రమణీయంగా ,దేవాలయం ముందు బాబా వారి విగ్రహం చాల పెద్దదిగా ,చూడ చక్కగా ఉంటుంది .

సాయిబాబా మందిరం - కొవ్వుర్





గోదావరి నది కి అనుకోని ఉన్న కొవ్వుర్ పట్టణం లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చాల ప్రశాంత వాతావరణం లో ఎంతో ఆహాలదకరంగా ఉంటుంది .

సాయిబాబా దేవాలయం - ఒంగోలు





జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణం లో ఎంతో మహిమన్మితమైన ,శక్తి వంతమైన సాయి బాబా మందిరం ఉంది . ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ది చెంది న దేవాలయం . భక్తుల కోరిన కోరికలు తీరుస్తారు బాబా .

సాయిబాబా మందిరం - ప్రొద్దుటూరు





కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టాన కేంద్రం లో నిర్మించిన సాయిబాబా మందిరం చాల మహిమన్మితమైన క్షేత్రం . ప్రసాంతమైన వాతావరణం లో నిర్మించిన బాబా మందిరం లో విగ్రహం ఎంతో రమణీయంగా ఉంటుంది .

సాయిబాబా మందిరం -కర్నూల్





కర్నూల్ జిల్లా కేంద్రం లో ఉన్న సాయిబాబా మందిరం చాల పురాతనమైనది మరియు చాల విశాలమైన ఆవరణలో నిర్మించిన క్షేత్రం ఇది .

సాయిబాబా దేవాలయం - పరకాల





పరకాల-హన్మకొండ రహదారి పై ఒక కిలోమీటర్ దూరం లో నిర్మించిన సాయిబాబా దేవాలయం ఎంతో రమణీయంగా ,ఆహాలదకరంగా ఉంటుంది . ఇక్కడ బాబా విగ్రహం షిరిడి లోని విగ్రహాన్ని తలపిమ్పచేసేలా ఉంటుంది . ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ఇక్కడ బాబా కి ఘనంగా పూజలు నిర్వహిస్తారు . చాల మంది బక్తులు వచ్చి బాబా న దర్శిస్తారు .

నెమలి సాయిబాబా మందిరం -నెమలి గ్రామం







నిజామాబాదు జిల్లాలోని భాన్స్వాడ పట్టణానికి 8 కి మీ దూరం లో గల నెమలి గ్రామలో వెలసిన ఈ ప్రసిద్ది సాయి సన్నిది క్షేత్రం చాల రమణీయంగా ఉంటుంది . ఈ గ్రామం లో వెలసిన సాయిబాబా మందిరాన్ని మినీ షిరిడి అంటారు . ఇక్కడ దేవాలయం ఆవరణ లో 23 అడుగుల సాయిబాబా విగ్రహం ఉంది .

సాయిబాబా దేవాలయం-కోరుట్ల







జగిత్యాల పట్టణానికి 24 కి మీ దూరం లో కోరుట్ల గ్రామా కేంద్రం నుండి 2 కి మీ దూరం లో వెలసిన సాయి మందిరం సుమారు 35 సంవత్సరాల్ క్రితం నాటిది .ఒక భక్తుడు షిరిడి వెళ్లి సాయిబాబా ప్రతిమ ను తీసుకోని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు . ప్రతి గురువారం ఇక్కడ స్వామి వారికి పత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి మరియు అన్న దానం కూడా జరుగుతుంది .

సాయిబాబా దేవాలయం-దిల్సుఖ్నగర్





భాగ్యనగరం లోని దిల్సుఖ్నగర్ లో వెలసిన సాయిబాబా మందిరం సుమారు 30 స సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ,హైదరాబాద్ షిరిడి గ పిలిచే ఈ దేవాలయం లో సాయిబాబా మందిరం షిరిడి సాయిబాబా మందిరాన్ని పోలి ఉంటుంది . ఇక్కడ బాబా ని దర్శించుకుంటే షిరిడి సైనతుని దర్శనం అయినట్లు బక్తులు విస్వాశం .

సాయిబాబా దేవాలయం -మంచిరియాల్









మంచిరియాల్ పట్టణం కేంద్రం లో వెలసిన సాయిబాబా మందిరం సుమారు 25 సంవత్సరాల క్రితం కట్టిన బాబామందిరం ప్రశాంతత కు మారు పేరు . అందరి దేవుడైన సాయిబాబా ఇక్కడ బక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి .

సాయిబాబా మందిరం -మాధవనగర్ ,నిజామాబాదు





నిజామాబాదు పట్టణం లోని మాధవనగర్ లో వెలసిన సాయిబాబా మందిరం చాల పురాతనమైనది . చాల మహిమన్మితమైన్డది . ఇక్కడికి భక్తులు బాగా వస్తు ఉంటారు .

సాయిబాబా మందిరం -చితాపూర్





బాలకొండ మండల కేంద్రానికి 3 కి మీ దూరం లో గల చితాపూర్ గ్రామం లో ఉన్న ఈ సాయిబాబా మందిరం ఎంతో రమణీయంగా ,ప్రశాంతత కు మారు పేరు ల ఉంటుంది .

సాయిబాబా దేవాలయం -పత్తి కొండా





కర్నూల్ నుండి 90 కి మీ దూరం లో ఉన్న పట్టి కొండా పట్టణం లో ఉన్న సాయిబాబా దేవాలయం ఎంతో మహిమన్మితమైనది . ఎప్పుడు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు బక్తులను కనువిందు చేస్తుంటాయి .

సాయిబాబా మందిరం -చితాపూర్ ,Nizamabad





బాలకొండ మండల కేంద్రానికి 3 కి మీ దూరం లో గల చితాపూర్ గ్రామం లో ఉన్న ఈ సాయిబాబా మందిరం ఎంతో రమణీయంగా ,ప్రశాంతత కు మారు పేరు ల ఉంటుంది .

సాయిబాబా దేవాలయం -విశాఖపట్టణం









పట్టాన కేంద్రం లో వెలసిన సాయిబాబా దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . ఇక్కడ సాయిబాబా తో పాటు మిగతా దేవుళ్ళ విగ్రహాలు కూడా ప్రతిస్తిన్చాబడ్డాయి .. హనుమాన్, శనిస్వార ,శివ ,సూర్యనారాయణ ,గణపతి ,అయ్యప్ప ,కుమారస్వామీ ,దత్తాత్రేయ విగ్రహాలు ప్రతిస్తిన్చాబడ్డాయి .