జపమాల విశిష్టత: పగడమాలతో జపం చేస్తే..?


మనోభీష్టం నెరవేరేందుకు ప్రతి జపం చేసుకోవడం తెలిసిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క దివ్యమైన నామాన్ని నూటా ఎనిమిది మార్లు జపించినట్టు తెలియడానికిగాను అంతా జపమాలలు వాడుతుంటారు.
జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ వుంది. పగడాల మాలతో జపం చేయడం వలన సంపదలు వృద్ధి చెందుతాయి.
ఇక జపమాల ఏదైనా మనసును పరిపూర్ణంగా భగవంతుడి నామస్మరణపై నిలిపినప్పుడు మాత్రమే అది ఆశించిన ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు.