Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

నాగపంచమి
"శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః
పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ
విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ"
వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది.
నాగపంచమి శ్రావణమాసం శుక్ల పంచమినాడు జరుపుకునే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు

నాగ జాతి జనము : :కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .
దాంతో సకల దేవతలు అంతా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .
"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించారాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా అతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది :ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
అందుచేత శ్రావణమాసం లో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగ పంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుంది.


గరుడ పంచమి :శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే గరుడ పంచమి, నాగపంచమి గా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి వాహనం, మిత్రుడు, దాసుడైన గరుడుడిని స్తుతించాలి.
ఈ రోజున గరుత్మంతుడి విగ్రహాన్ని దేవాలయాల్లో ప్రతిష్టించిన వారికి సత్సంతానం కలుగుతుందని విశ్వాసం. వాహనలాభం, కోరిక కోరికలు నెరవేరడం, విష్ణులోక నివాసభాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
"తన కర్తవ్య నిర్వహణ కోసం తాను ఏ క్షణంలోనైనా సిద్ధమే..! అన్నట్లుగా గరుడుడు దర్శనమిస్తాడు. ఆ విధంగానే మనమూ కర్తవ్య నిర్వహణకు అనుక్షణమూ సిద్ధంగా ఉండాలన్నదే "గరుడపంచమి" పరమార్థము. అంతేగాకుండా మనం కూడా గరుత్మంతుడిలాగా మాతృభక్తిని కలిగి ఉండాలి. శారీరక మానసిక బలాలను పెంచుకోవాలి.
అంతేగాకుండా.. తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోయిన గరుత్మంతుడిని "గరుడ పంచమి" రోజున నిష్టతో పూజించే వారికి పాపాలు తొలగిపోయి, పుణ్య ఫలితాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.