Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

మల్లికార్జున స్వామి దేవాలయం -బీరంగూడ




పటాన్ చెరువు -అమీనాపూర్ పంచాయితీ పరిధి లో గల బీరంగూడ గ్రామం లో వెలసిన శైవ క్షేత్రం. 13వ శతాబ్దం లో ఈ క్షేత్రం వెలసింది అని ఇక్కడనుండి శ్రీశైలం వెళ్ళడానికి సోరంగా మార్గం ఉండేది అని చెబుతారు .హైదరాబాద్ నుండి పటాన్ చెరువు కి 25 కి మీ దూరం ఉంటుంది అక్కడి నుండి ఈ క్షేత్రం 5కి మీ దూరం లో ఉంటుంది . ఒకప్పుడు ఈ దేవాలయం ఎంతో వైభవంగా వెలసింది అట ఆ సమయం లోనే ఈ క్షేత్రాన్ని రెండవ శ్రీశైలం గ పిలిచేవారని చెబుతారు .


13 వ శతాబ్దం లో నిర్మించబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది . బ్రుగు మహర్షి మరియు ఇంకా కొంతమంది ఋషులు ఇక్కడ తపస్సు చేయగా ఇక్కడ శివ మరియు కొలను ఆవిర్భావం జరిగాయని చెపుతుంటారు. దేవాలయం లో 4 అడుగుల వీరభద్ర స్వామి విగ్రహం ఉంది అందుకీ దీనిని వీరప్ప లేక బీరప్ప దేవాలయం అనేవారు అది క్రమేనా బీరం గూడా గ మారిపోయింది అని చరిత్ర.


మహాశివరాత్రి సమయం లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి .ప్రతి ఒక్కరు తప్పకుండ చూడవలసిన క్షేత్రం ఇది.






Route Map:-

Page Web