Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

బ్రహ్మేశ్వరాలయం-చేబ్రోలు




గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామం యందు కలదు . రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని శ్రీ రాజ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించారని చెప్పుచుందురు . ఇచట బ్రహ్మ తనకు గల నాలుగు ముఖాలతో నలువైపులా చుచు చుండును . తూర్పు పడమర దిశల యందు శివాలయాలు ,ఉత్తర దక్షిణ దిశలలో విశ్నుఅలయలు కలవు .


గుంటూరు జిల్లా కేంద్రానికి 14 కి మీల్ల దూరంలో చేబ్రోలులో (పొ న్నూరు మార్గంలో) క్రీశ 18వ శతాబ్దం లో దేవాలయాన్ని కట్టించి ధన్యుడయ్యాడు రాజా వాసిరెడ్డి వెంకట్రాద్రి నాయుడు. . బ్రహ్మశ్వరునిగా పిలుచుకుని ఈ స్వామికి నిత్యమూ ఇక్కడ ఎటువంటి పూజాదికాలు జరుగకపోయినా లింగాకారంలో ఉన్న స్వామికి ప్రతిరోజు అభిషేకం, విభూది ధారణ వంటివి మాత్రమే జరుగుతాయి. చతుర్ముఖరూపంతో అలరారే స్వామివారి ప్రాంగణం సుందరంగా ఉంటుంది.


సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మా ణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పు న వంతెన నిర్మించారు.


ఇక గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగు ల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగు ల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు కనిపిస్తారు. లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు.


దేవాలయానికి సమీపంలో మరో 9 ఆలయాలు ఉండటం విశేషం. గతంలో నూరు దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండేవట. ఉన్న ఆలయాల్లో కేశవస్వామి ఆలయం ప్రాచీ నమైందిగా చెబుతారు. విశాలమైన ప్రాకారాలు... రాజగోపురాలు.. మంటపాలు... స్తంభాలు... ఏకరాతి శిల్పాలు.. శిల్ప సంపద అంతా ఇక్కడ కొలువుదీరి ఉందా అన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్ర హమూర్తులు, నాగేశ్వరాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. విషయ మేమంటే బ్రహ్మ చూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.
తూర్పు, పడమర దిక్కులలో వరుసగా చంద్ర మౌళ్వేశ్వర, సహస్రలింగేశ్వర ఆలయాలు (శివాలయాలు), ఉత్తర దక్షిణాలలో వేణుగోపాలస్వామి, రంగనాధ స్వామి (వైష్ణవ) ఆలయాలు, నైరుతి, వాయువ్య, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో శక్తి స్వరూపుణులైన అమ్మవార్ల ఆలయాలను ఏర్పాటు చేసి బ్రహ్మేశ్వర ఆలయాన్ని దిగ్బంధం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు.

Route Map : -