Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

మత్స్య అవతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం -జిల్లెలగూడ





భాగ్యనగాగారానికి సమీపం లో సుమారు 500 సంవత్సారాల చరిత్రగల శైవ -వైష్ణవ క్షేత్రం మత్స్య అవతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం జిల్లెలగూడ ప్రాంతం లో వెలసింది .

స్వామి వారి మూలా విరాట్ విగ్రహం మత్స్య అవతార విష్ణు రూపం మరియు తల బాగం లింగాకారం లో ఉంటుంది అందుకే ఈ క్షేత్రాన్ని హరి హర క్షేత్రం అని అంటారు. మనకు సాదారణంగా వైకుంట ఏకాదశి రోజు మాత్రం స్వామి వారి ఉత్తరద్వార దర్సనం లబిస్తుంది కానీ ఇక్కడ స్వామి వారి ఆలయం ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉన్నది అందుకే ఇక్కడ భక్తులకు రోజు స్వామి వారి దర్సనం ఉత్తరంవైపు దొరుకుతుంది . క్షేత్ర మహత్యం ఏంటి అంటే ఇక్కడ స్వామి వారి స్వయం భు విగ్రహాన్ని ఎవరు ప్రతిస్టించలేరు అది భు భాగం లొనుంచి వచ్చి వెలిసింది అని పురాణ గాథ !!


ఈ క్షేత్రం ఎల్బి నగర్ నుంచి 4 కి మీ మరియు చంపపేట్ నుంచి 3 కి మీ దూరం లో ఉంటుంది .