Share This on Your Social Netowrk


శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం,కోడంగల్




కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...


మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ పట్టణం లో ఉన్న శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది . సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం లో తిరుపతి లో ఎలాగైతే పూజ కార్యక్రామాలు జరుగుతాయో అదే విదంగా జరుగుతాయి . శ్రీ మహాలక్ష్మి ,పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ,రమణీయంగా ,శొబయమనంగ జరుగుతాయి . ఆ దేవా దేవుని చూడడానికి జిల్లా నుండే కాక ,కర్ణాటక ,మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తు ఉంటారు . తెలంగాణా లో వైకనస ఆగమ శాస్త్ నియమాల ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహించే బహు కొన్ని దేవాలయాల్లో ఇది చాల ప్రముక్యతను సంపాదించుకున్న దేవాలయం . దేవాలయ ఆవరణలో కోనేరు , నవగ్రహ లు కూడా ఉన్నాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్శించి ఆ దేవా దేవుని కరుణ కటాక్షాలను పొందగలరు .


దేవాలయం లో జరుగు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు
అభిషేకం
అర్చన
లక్ష్మి తులసి అర్చన
ధనుర్మాస పూజలు
దసరా
పండుగలప్పుడు ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .


ఈ పట్టణం లో వెలసిన ఇతర దేవాలయాలు
కేశవ స్వామి దేవాలయం - చాల పురాతనమైన దేవాలయం
రాఘవేంద్ర స్వామి దేవాలయం
గడిబావి శివాలయం
హైదరాబద్ నుండి గుల్బర్గా,యద్గిర్ వెళ్ళు బస్సులు(Via కోడంగల్),కోడంగల్ బస్సు సర్వీస్ లు ఉంటాయి .









Route Map :-

www.Maps-Generator