Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం – కొండగట్టు


“మనోజవం మారుత తుల్యవేగం । జితేంద్రియం బుద్ది మతం వరిష్టం
వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామ ధూతమ్ శిరస్సానమామి ॥ “


కరీంనగర్ పట్టణానికి 35 కి మీ దూరం లో వెలసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది .


త్రేతా యుగం లో ఇక్కడ ఋషులు యాగ యజ్ఞాదులు చేసుకుంటున్న సమయం లో ,ఆంజనేయుడు,లక్ష్మణుడి రక్షణార్థం సంజీవ పర్వతం తీసుకోని వెళ్ళసాగాడు అది గమనించిన ఋషులు స్వామి వారిని ఆహ్వానించగా ,వాయుసుతుడు త్వరగా వెళ్ళాలి ,తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడట .వస్తాను అన్న హనుమ రాలేదు ,ఋషులు చేస్తున్న దైవ కార్యక్రంలను శక్తులు ఆటంకా పరుస్తున్నాయి . చివరికి ఋషులు తపస్సుకు మెచ్చి హనుమ ఇక్కడ స్వయం భు వెలిసాడు . అప్పట్నుండి ఋషులు స్వామి వారిని అరదిస్తూ వారి కార్యక్రమాలను నిర్విగ్నంగా చేసుకోసాగారు .


సుమారు 400 సంవత్సరాల క్రితం ఒక యాదవుడు ఆవు తప్పిపోయింది అని ఈ కొండప్రాంతం లోకి రాగ అతనికి స్వామి వారు కనిపించి నేను ఇక్కడే పొదలలో ఉన్నాను వెతికి దేవాలయం నిర్మించమని చెప్పి ఆవు జడ జెప్పి అదృశ్య మయ్యాను అంతట యాదవుడు మిగతా వారి సహాయం తో స్వామి వారికి ఆలయాన్ని నిర్మించాడని ,కొండలు ,గుట్టల పైన క్షేత్రం ఉండటం వలన కొండగట్టు అని పేరు వచ్చింది అని స్థల పురాణం .


దేవాలయమునకు దక్షిణ దిశా లో ఒక బావి ఉన్నది . దానిలోని నీటినే స్వామి వారికి అభిషేక ,ఆరాధనా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు . ఆలయ ఆవరణ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ,ఆళ్వారులు ,శ్రీ లక్ష్మి దేవి అమ్మ వారి విగ్రహాలు కూడా ఉన్నాయి .


ప్రతి సంవత్సరం ఈ దేవాలయం లో హనుమాన్ జయంతి కార్యక్రమలు ఘనంగా జరుగుతాయి . దీర్ఘ కాల రోగాలతో బాదపడుతున్న వారు ,గ్రహ దోష లో తో సతమతమవుతున్న వారు స్వామి వారిని దర్శించుకుంటే తమ కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం .


సమీపం లో చూడదగిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు
--------------------------------------------------------
శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం -వేములవాడ (35 kms ఫ్రొం Karimnagar )
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -ధర్మపురి (80 km from కరీంనగర్)
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం -కాళేశ్వరం (16 kms from Mahadevapuram and 32kms from Manthani )
మంథని దేవాలయాలు (72 K.M away from Karimangar in the North-East side)
లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -రాయిఖల్ (20 km away from Jagtial)


Route Map :-

www.Maps-Generator