Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

మావుళ్ళమ్మ దేవాలయం
భీమవరం నగరానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్చిమ గోదావరి జిల్లా లో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకూ లేనంత ఉంటుంది.
బెజవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక తరువాత అంతటి మహిమగల తల్లిగా కొనియాడబడుతున్న భక్తుల పాలిటి కల్పవల్లి భీమవరం మావూళ్ళమ్మ. తొమ్మిది దశాబ్దాల క్రితం భీమవరం అనే గ్రామంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్టరూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. ఆ మహిమాన్విత కల్పవల్లి మావూళ్ళమ్మ.


మావుళ్ళమ్మకు శతాబ్దానికి మించిన చరిత్ర ఉంది. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరిందట. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెళ్ళి వెతకగా అమ్మవారి విగ్ర హం లభ్యమయ్యిందట. అప్పుడు వారు అక్కడ ఒక పాక వేసి అమ్మ వారిని నిలిపి ఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో ‘మామిళ్ళమ్మ’గా తదనంతరం ‘మావుళ్ళమ్మ’గా పిలవటం అలవాటయ్యింది


ఇప్పుడున్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూసేందుకు భయపడేవారు. ఆ తల్లి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రస్తుతం శాంతమూర్తిగా దర్శనమిస్తున్నారు. 1910 సంవత్సరంలో వరదల కారణంగా అమ్మవారి విగ్రహం నీటిలో నాని చాలా వరకూ దెబ్బతిన్నది. దానితో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు ద్వారా అమ్మవారి విగ్రహ పునర్నిర్మాణం జరిగింది. ఆయన గర్భాలయానికి నిండుగా అమ్మ వారికి రూపాన్నిచ్చాడు. అయితే అప్పటికి ప్రళయ భీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూ పిణిగా తీర్చిదిద్దారు.


Sri Jaganmatha Mavullamma ammavaru: Protector of people from evil spirits. It is believed Jaganmatha (Universal Mother goddess) Sri Mavullamma ammavaru (Mother goddess) is the incarnation of Mahakali (the goddess of Shakthi-Power) in olden days. she is in a midst of mango groves. So she is called ‘Mavullamma’ (Mamidi is local tongue to Mango). It is believed that neighbour villagers treated her as their own villages mother goddess, So she is addressed as ‘Mavullamma’ (Mother goddess of my own village).
The temple history of Jaganmatha Sri Mavullamma came to limelight in the year 1880 AD, Since then only the temple history is available to us. It is believed that she is laid in Motupallivari street, under couple of pipal and Neem tree. Every year in the month of “Jyesta masa” (third month of auspicious Telugu almanac calendar) on “Paadyami” (new slender crescent moon day). Devotees (worshippers) celebrates one month long celebration in this month. There is a festive look every where in and around the town. The Devastanam (Temple committee) and local fruit and vegetable trader’s committee felicitates artists, actors, actresses, musicians, great men of all walks of the life.In 1910 AD floods the Mulavirat (Statue of Mavullamma) partially damaged. Later reinstates by great artist, sculptor Sri Grandhi Narasanna’s son Sri Grandhi Appa Rao. He carved the Mulavirat (Mavullamma Statue) from ferocious stature to pleasant present peace form.It is believed ever since her dwelt the town has been become prosperous. The town gradually developing day by day with her blessings. The people have been living peacefully with her auspicious blessings.

Address:

Kuriseti Vari Street,
Gandhinagar,
Bhimavaram,
Andhra Pradesh 534202,


Route Map:-