Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం-నారాయణ తిరుమలగిరి




శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమలగిరిపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్ర గల దేవాలయం . ఈ ఆలయం ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న దేవాలయము .



ఆలయ నిర్మాణము ఒక భక్తుడి సంకల్పం ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెబుతుంటారు. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట.


స్వామివారి ఆదేశానుసారం... నారాయణదాసు అనువైన కొండ కోసం గాలిస్తుండగా, నాగావళి నదికి పశ్చిమ దిశలోని ఒక కొండను ఎంపిక చేశాడు. ఈ కొండపైని స్వామివారి పాదాల గుర్తులను అనుసరించి, అక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 1961వ సంవత్సరంలో తిరుపతిలో తయారు చేయించిన భూనీలాసమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలను పాంచరాత్రాగమ ప్రకారం ప్రతిష్టించాడు. అనంతరం 1997లో నారాయణదాసు మృతి చెందేదాకా ఆలయ ధర్మకర్తగా వ్యవహరించాడు. నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన శ్రీవేంకటేశ్వర ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది. ఆలయంలోని శ్రీరామానుజాచార్య, శ్రీనమ్మాళ్వార్ విగ్రహాలు.. స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నర్సింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన విగ్రహాలను భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి.

దేశంలోనే అత్యంత ఎత్తయిన గరుత్మంతుని (గరుఢ) విగ్రహం ఈ ఆలయంలో కలదు. అలాగే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించే లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయంలో ఐదు అంతస్తుల గాలి గోపురం తిరుమలేశుని సన్నిధిని గుర్తుకు తెస్తుంది. ఆలయంలోని బేడా మండపం, కళ్యాణ మండపం, యాగశాల, పుష్కరిణి, ప్రాకారాలు ఆకట్టుకుంటాయి.


ఈ శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజాదికాలను నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణంతోపాటు, శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తదితర పండుగలను, పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో విష్ణు సహస్ర నామపారాయణం జరుగుతుంటుంది.
వెళ్ళు మార్గం :-

-------------
శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండుకు కిలో మీటరు దూరంలో ఉంటుంది శ్రీవేంకటేశ్వర ఆలయం. శ్రీకాకుళం రోడ్ (ఆముదాల వలస) రైల్వే స్టేషన్కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.



Festivals
Shivaratri is one of the main festivals celebrated at the Srimukhalingam Temple. About two lakh devotees visit the temple on this auspicious day and seek the blessings of the Lord. Prayers are offered after a holy dip in the Vamsadhara River. The temple authorities conduct several special pujas and religious programs in the temple precincts and in the villages nearby on Shivaratri. Cultural events and dramas are also held over a period of two days.

Route Map:

maps-website.com