Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

పెద్దమ్మ గుడి –పాల్వంచ





ఖమ్మం జిల్లాలో పాల్వంచ నుండి భద్రాచలానికి వెళ్ళే దారిలో వెలసిన అమ్మ వారి క్షేత్రం పెద్దమ్మ గుడి. ఖమ్మం జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ఇదొకటి. పాల్వంచకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం దట్టమైన అడువులు ఉన్న ఈ ప్రదేశం లో ఒక పెద్ద పులి తిరుగుతూ ఉండేది అట . ఒక చింత చెట్టు నీడలో విశ్రమించేది .. ఆ దారిలో నడిచే వెళ్ళే బాటసారులు దానిని చూసుకుంటూ వేల్లెవారట కానీ ఎవ్వరిని ఏమి చేసేది కాదట అల్లా అమ్మ వారి వాహనం ఆయన పులి ని దైవ స్వరూపంగా బావించి అక్కడ అమ్మ వారి విగ్రహం తెచ్చి చిన్న గుడి కట్టారట, రాను రాను అది చాల పెద్దగ అయి ఇప్పుడు ప్రజల కోరికలను తీర్చే కల్పతరువు అయింది అమ్మావరి గుడి .

పెద్దమ్మకు భక్తిశ్రద్ధలతో నివేదనలు సమర్పిస్తారు. మొక్కుతారు, ముడుపులు చెల్లిస్తారు. గుడి మహా శక్తివంతమైంది. పెద్దమ్మ భక్తుల మొర ఆలకిస్తుందని, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని, అన్నింటా విజయం సమకూరుతుందని, పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని స్థానికులు చెప్తారు.పెద్దమ్మ గుడి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఆదివారంనాడు వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతుంది.