Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ వల్లూరమ్మ దేవస్ధానం
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణానికి సుమారు 5 కి.మీ. దూరంలో దక్షిణ దిశగా, విజయవాడ- మద్రాసు జాతీయ రహదారిపై సుమారు ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ప్రాధాన్యతను నంతరించుకొని, నేటికిని దినదిన ప్రవర్థమానమవుతున్న దేవాలయం శ్రీ వల్లూరమ్మ దేవస్ధానం.
క్షేత్రపాలకురాలు శ్రీవల్లూరమ్మే. ప్రక్కనే విశాలమగు చెరువు గలదు. ఇది వల్లూరు గ్రామం- టంగుటూరు మండల పరిధిలో ఉంది. తూర్పు దిశలో సుస్థిరంగా పీఠం వేసుకొని చిరుదరహాసములు చిందిస్తూ, చూచినంతనే భక్తి భావంతో కేలు మోడ్పుననెడి భావం కలిగిస్తోంది అమ్మవారు.సుమారు 450 సం||ల క్రిందట ఈ ప్రాంతమంతా వెంకటగిరి రాజులు, ఒంగోలు సమీపాన గల మందపాటి రాజుల సరిహద్దు ప్రాంతముగా ఉండేది. ఒకసారి ఒంగోలు రాజావారిపైకి, వెంకటగారి రాజా వారు దుష్ట పన్నాగంలో భాగంగా నొక దుష్టశక్తిని ప్రయోగించారు. అది గ్రామాలపై బడి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, పశువులు, శిశువులు అకాలమృత్యువు వాతబడేట్లు భయభ్రాంతులు చేయుచుండెను.
ఈ పీడను వదలించుకొనుటకూ తూర్పు తీరాన ఈతముక్కల (నేడు కొత్తపట్నం మండలంలో గలదు) అను గ్రామము వద్ద గల వనంలో, అద్దంకి వాస్తవ్యులైన రామచంద్రయ్య అను పండితుని ఆధ్వర్యంలో మహా చండీ యాగం చేసారు. ఈ యాగానికి ఆహుతిగా అద్దంకి నాంచారమ్మను ఆహ్వానించారు. యాజ్ఞికులు మంత్రపూరిత ఆహ్వానంతో యాగానికి పలువురు పండితులు, విజ్ఞానులు, బ్రహ్మణులు హాజరయ్యారు. ప్రజలు తమ బాధలు తొలగించమని నిష్ఠతో పలు పూజాసంభారములు చేకూర్చారు.ఆ యాగము పరిపూర్తి గావొచ్చే సమయాన ఫలశృతిగా ఒక దివ్యమూర్తి వెలువడినది. అగ్నిశిఖల నుండి ఉద్భవించి జ్వాలగా మారింది. ఆ జ్వాల రూపమే స్త్రీ రూపంగా మారి, జ్వాలాముఖిదేవత ఆవిర్భవించెను. ఆ యాగ హోమముల నుండి వెలువడిన అగ్గిరవ్వల నొక గోళం మెరుపులా లేచి ఆకసమున నెగసి, నేడున్న దేవాలయాల ప్రదేశమున వల్లూరమ్మగా ఆవిర్భవించెను. మహిమాన్వితురాలైన ఆ తల్లి ఆయా ప్రాంత ప్రజలను కొర్కెలు ఈడేర్చగా.
నాటినుండి పల్లెలె దుష్టపీడనం కనుమరుగైంది. పశువులు, శిశువులు వ్యాధుల బారి నుండి తెప్పరిల్లారు. అద్దంకి నాంచారమ్మ, ఈతముక్కల జ్వాలాముఖి, వల్లూరమ్మ తల్లుల ఏకగర్భ సంజాతులుగా, అక్క చెల్లెండ్రుగా భావించి పూజిస్తుంటారు. దేవి నవ రాత్రులు, సంక్రాంతి పండుగ మరియు మంగళ, శుక్ర, ఆది వారాలలో భక్తులు విశేషముగా అమ్మవారిని దర్శించుకుంటారు.
పొంగళ్ళు పెట్టడం, శిరోజాలు సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేక పండుగ దినాలలో భక్తుల సందడితో, వివిధ రకాల స్టాళ్ళతో, వాహనాల వరసలతో, ప్రత్యేక అలంకరణలతో, అభిషేకాలు, పూజలు నిర్వహించబడుతుంటాయి. ఇక్కడ వైఖానస విధానంతో పూజలే జరుగును. ఒంగోలు పట్టణము నుండి ఆటో లేక బస్సులలో పదిహేను నిమిషాలలో అమ్మవారి దేవస్థానాన్ని చేరుకోవచ్చు.


www.Maps-Generator