Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

కోదండ రామస్వామి దేవాలయం,ఒంటిమిట్ట
కడప నగరం నుంచి 28 కి మీ దూరం లో రాజంపేట పట్టణానికి సమీపం లో గల ఒంటిమిట్ట గ్రామం ప్రకృతి సోయగానికి నిలయం . 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్య పాలకుడు సదాశివరయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం విజయనగర శైలికి చక్కటి ఉదాహరణ .


విశాలమైన అవారణలో నిర్మించబడిన ఈ ఆలయం లో చుట్టూ ఎత్తైన ప్రహరి గోడ నిర్మించబడింది తూర్పు,ఉత్తరం దక్షిణం వైపు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి . ప్రధాన గాలిగోపురం 165 అడుగుల ఎత్తులో ఉంటుంది .


విశాలమైన ఈ ఈ అలయంనందు అద్బుతమైన శిల్పకళ,ముఖ మండపం రమణీయంగా ఉంటాయి. శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో దేవాలయం ఎంతో అభిరుద్ది చెందింది గ శాసనాల ద్వారా తెలుస్తుంది. దేవాలయ ప్రాంగణం లో చాల ఉపాలయాలు ఉన్నాయి .


ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.


గర్భ గుడి లో సీతాలక్షమన సమేతుడై శ్రీ రాముడి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. ఐతే ఆంజనేయుని విగ్రహాలు గర్బగుడి లో కనిపించవు .ఆలయ సమీపం లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించబడ్డాయి . దేశం లో ఎక్కడ లేని విదంగా స్వామి వారి కల్యనమహోత్సవాలు రాత్రి సమయం లో జరుగుతాయి . కన్నుల పండుగగా జరిగే ఆ ఉత్సవాలు చూడడానికి వేయి కళ్ళు సరిపోవు.


ఒంటిమిట్ట కోదండ రామాలయం చరిత్ర దృష్ట్యా సంస్కృతి,నిర్మాణ శాస్త్రం దృష్ట్యా ఎంతో ప్రాదాన్యతను సంతరించుకుంది. ఇంత అందమైన ,పవిత్రమైన ప్రత్యేకమైన ఆలయాన్ని ఒకసారి సందర్శించి మనోరంజనాన్ని ధైవసన్నిధిని అనుబించావొచ్చు.
పూజలు,ఉత్సవాలు

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు.


Vontimitta Kodandarama Swamy temple is at a distance of around 25.1 km from Kadapa district and it takes about 28 minutes to reach this ancient historic and cultural temple by car. The 450-year old Lord Sri Rama temple is located on Kadapa-Tirupati road and has ample space for vehicle parking.

Ancient legends say that the famous Vontimitta temple is built in a single day by ardent devotes of Bhagawan Sri Rama, Vontudu and Mittudu. After construction of this wonderful temple with 32 pillars, both devotees sacrificed their lives and transformed into statues. Even today you can find them at the entrance of the temple.

Another interesting fact about this temple is that it is the only place in India where Sri Seeta Rama Kalyanam is celebrated at night. It is one of the most beautiful Lord Rama temple in India and is praised in the past by the famous French traveller, Tavernier in the year 1652.
It is believed that Lord Jambuvantha has placed the Lord Rama idol in this temple. Garbhagudi consists of Bhagawan Sri Rama, Goddess Sita and Lord Laxmana idol engraved on a single rock. Also, one can find Sri Anjaneya Swamy Temple to the right and Lord Vinayaka Temple in a beautiful dancing posture in the main Mandapam of the temple.


Another surprising fact about Vontimitta Kodanda Rama Swamy temple is that it is one of the few temples in India, where the idol of Bhagavan Sri Rama is without Lord Anjaneya Swamy at his side.
The Vontimitta temple mandapam architecture was designed by the Vijayanagara rulers. Sri Tallapaka Annamacharya, a great devotee of Lord Rama lived on Tallapaka village very close to Vontimitta and is said to have visited Vontimitta temple and praised Lord Sri Rama in his Keerthanas. Also, Kishkindakanda is believed to have happened in this region.


Pilgrims across the country can reach this amazing temple by buses, vehicles or trains. Chennai to Mumbai railway line and Kadapa-Tirupati bus route pass through Vontimitta. APSRTC ply frequent buses from Cuddapah [Kadapa] to Vontimitta.


Nearest Railway Stations to Vontimitta:
• Ontimitta Rail Way Station [1.4 km, 4 mins]
• Bhakarapet Rail Way Station [8.2 km, 8 mins]
• Kadapa Rail Way Station [25.9 km, 30 mins]
• Tirupati Rail Way Station [117 km, 1 hour 48 mins]
Route Map

map generator